కొత్త సీఎస్ గా రామ కృష్ణ రావు?
ఈనెలఖరుతో ముగియనున్న శాంతి కుమారి పదవి కాలం
తనకే అవకాశం వస్తుందంటున్న శాంతి కుమారి
లిస్ట్ లో రామ కృష్ణ రావు , వికాస్ రాజ్ , నవీన్ మిట్టల్ లు
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎ్‌సగా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎ్‌సగా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం.1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. అయితే ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవికాలం ఈనెల ఆఖరు తో ముగియనుంది. ఆమె స్థానంలో రామ కృష్ణ రావు ను నియమిస్తే బాగుంటుందన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ ప్రినిసిపాల్ సెక్రెటరి గా తెలంగాణలో అత్యధిక కాలం పని చేసిన అధికారి గా రామ కృష్ణ రావు కు పేరుంది.టీఆరెస్ హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు తీసుకున్న అయనను సీఎస్ గా నియమించడం పట్ల కొంత వ్యతిరేకత ఎదురు అవుతుంది. రాష్ట్రంలో ఆయన కంటే సీనియర్లు ఉండగా ఎలా నియమిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది.గతంలో టీఆరెస్ కు కొంత అనుకూలంగా ఉండేవారన్న పేరుంది.ఇప్పుడు సీఎస్ గా అవకాశం ఇవ్వడం పట్ల ఇబ్బందికరంగా మారె ఛాన్స్ ఉందంటున్నారు. ఇక స్టేట్ వైస్ గా చాల మంది కాంట్రాక్టర్లు , పేద , మధ్య తరగతి వాళ్లకు ఈయన అందుబాటులో ఉండరట.ఇక చీప్ సెక్రెటరీగా బాధ్యతలు ఇస్తే సామాన్యులు ఎలా ఇబ్బంది పడతారోనన్న చర్చ సాగుతోంది ప్రభుత్వ వర్గాల్లో.
No comments
Post a Comment