రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ.
స్టేట్ లో అత్యంత కీలకమైన పిఆర్ లో అమాత్యుల పనితీరుపై ఆరోణలు.
శాఖలో సమన్వయ లోపం , పెండింగ్ పనులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటైన పంచాయితీ రాజ్ శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి తీరుపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోందట. ప్రభుత్వంలో చాల మంది సీనియర్లు ఉండగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ శాఖలో పురోగతి లేకపోవడంతో పాటు మిగతా డిపార్టుమెంట్ల తో పోలిస్తే పూర్తిగా వెనకబడి పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కాంట్రాక్టర్లకు సమయానికి బిల్లులు రాక నెలల తరబడి ఆర్ డబ్ల్యూ ఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని వాపోతున్నట్లు జోరుగా ప్రచారంసాగుతోంది.శాఖాపరమైన నిర్ణయాలతో పాటు విజిలెన్స్ కేసులకు సంబంధించిన ఫైళ్లు 400 పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.దీనిపై మంత్రి గారికి విన్నవించుకుందాం అనుకుంటే సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట బాధితులు.కేసులు,ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో నేరుగానే శాఖ పెద్దలు తమకు ఎం లేదా అని సన్నిహితుల వద్ద అడుగుతున్నట్లు పెద్ద ఎత్తున గుసగుసలు బయటకు వస్తున్నాయి.దింతో పాటు శాఖ పరిధిలో ఉన్న అన్ని విషయాల్లో మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తులు చక్రం తిప్పుతున్నారని సచివాలయం వర్గాల్లో పుకార్లు నడుస్తున్నాయి.
No comments
Post a Comment