ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట
ఎంపీలు , ఎమ్మెల్యేలకు రిపోర్టర్ సిఫార్స్.
విలేఖరి వైఖరితో అవాక్కవుతున్న పార్టీ నేతలు.
ఈ మధ్య కాలంలో జర్నలిజంలోకి రావడం కొంతమందికి ఫ్యాషన్ అయిపొయింది.వృత్తి రీత్యా ఒకప్పుడు ఉన్న నిబద్దత ఎక్కడ కనిపించడం లేదు.విలేఖరీ అంటే ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వలను అలెర్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రెగ్యులర్ గా ఆయా డిపార్ట్మెంట్ లతో పాటు పొలిటికల్ పార్టీ బీట్ చూసే వాళ్ళ వ్యవహార శైలీ జుగుప్సా కారణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా *కట్నం తీసుకొనే వాడు గాడిద* అంటూ ఉదర గొట్టే ఓ ప్రముఖ ఛానెల్ లో పనిచేసే రిపోర్టర్ తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు , ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఆ పార్టీకి సదరు రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి ఉత్తర తెలంగాణ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నేతతో పాటు దక్షిణ తెలంగాణ నుండి ఎంపీగా గెలిచిన సీనియర్ నేతను తనకు *రేర్ ర్యాబిట్* బ్రాండెడ్ దుస్తులను కొనివ్వలని వెంటపడుతున్నట్లు తెగ ప్రచారం నడుస్తోంది.గతంలో ఢిల్లీలో పనిచేసినప్పుడు లీడర్లు అందరు తమను ఫైవ్ స్టార్ హోటళ్లు , రెస్టారెంట్లకు, షాపింగ్ లకు తీసుకెళ్లే వారని కానీ హైదరాబాద్ లో పనిచేస్తే అలాంటి వేసులుబాటే లేదని బాధపడుతున్నడట. మార్కెట్ లో ఇలాంటి విలేఖర్లు కూడా ఉంటారా అని చెవులు కోరుకుంటున్నారట వినేవారు. అయితే ఈ విషయం పనిచేసే చోట ఉన్న వాళ్ళకు తెలుసా లేక తెలిసే ఉరుకుంటున్నారా అన్న ప్రచారం అయితే సాగుతోంది.
No comments
Post a Comment