తెలంగాణ సీఎస్ వైఖరి పై విమర్శలు
సీఎస్ వ్యవహార శైలిపై ఐఏఎస్ ల గుస్సా
అధికార పార్టీ నేతలకు దొరకని చీప్ సెక్రెటరి అపాయింట్మెంట్
పెండింగ్ లో పలు ఫైళ్ళు
డిస్కషన్ పేరిట కాలయాపన అంటూ ఉద్యోగుల ఆవేదన
తెలంగా చీప్ సెక్రెటరీపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.టీఆరెస్ పిరియడ్ లో అపాయింట్ అయిన సీఎస్ ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బదిలీ చేస్తారన్న ప్రచారం సాగింది.అయితే ఉన్న సీనియర్ అధికారుల్లో శాంతి కుమారి సీనియర్ కావడంతో అలాగే కొనసాగిస్తున్నారు.ఏడాది పిరియడ్ లో ప్రభుత్వానికి బాగానే సహకారం అందిస్తు వస్తున్న ఈ మధ్య కాలంలో సీఎస్ వ్యవహార శైలిపై రక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు , ప్రభుత్వం లో మిత్ర పక్షంగా ఉన్న వాళ్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట.ఇక సచివాలయంలో పని చేస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ లకు కూడా సమయం ఇవ్వడం లేదన్న చర్చ నడుస్తోంది బిఆర్ అంబెడ్కర్ సచివాలయం వర్గాల్లో.అప్పట్లో సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉండగా తనకంటూ సొంత కోటరీ ఏర్పాటు చేసి మిగతా ఐఏఎస్ లను ఇబ్బందులకు గురి చేసేవారన్న పేరుంది. ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత సీఎస్ నడుస్తున్నారట.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రెండో ముఖ్య మంత్రి.సాధారణ ప్రజలనుండి మొదలు మాములు కార్యకర్త వచ్చిన సమస్యలను దగ్గర ఉండి పరిష్కరించాలి.కానీ నెలల తరబడి తిరిగిన మేడం అపాయింట్మెంట్ దొరకడం లేదట.కనీసం సచివాలయ వార్తలు చూసే రిపోర్టర్లకు కూడా సమయం ఇవ్వడం లేదని సమాచారం.గతంలో సీఎస్ లుగా పని చేసిన వాళ్ళకు ప్రజలతో మంచి సంబంధాలు ఉండేవి.ఆయా ప్రభుత్వల్లో సీనియర్ అధికారులుగా ఉన్న వారు ఏంతో బాధ్యతగా ఉండేవారు.కాకిమాధవ రావు , మోహన్ కందా,మినీ మాక్సెస్,
మహంతి,శ్రవణ్ కుమార్,రఘు వర్ధన్ రావు,ఎస్పీ సింగ్,ఎస్కె జోషి ,ప్రదీప్ చంద్ర లాంటి ఆఫీసర్లు ప్రజల కోసం నిరంతరం పరితపించేవారు.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తమ సమస్యలుగా భావించి అందులో రూల్ ఉంటె చేసేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి.లేటెస్ట్ గా దేవాదాయ ధర్మాదాయ శాఖలో 190 అప్ గ్రేటెడ్ పోస్టులకు సంబంధించి అనుమతి ఇవ్వల్సి ఉంది. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెన్స్ , సీనియర్ అసిస్టెన్స్ ఉంటారు. వీళ్లంతా భవిషత్ లో ఈఓ లు గా పదోన్నతులు పొందుతారు. దీనికి ఫైనాన్స్ , జీఏడీ , ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రినిసిపాల్ సెక్రెటరీ అనుమతి ఇచ్చిన సీఎస్ మాత్రం డిస్కషన్ పేరుతో ఆపిందట.తద్వారా వందలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.సీఎస్ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి బర్డెన్ పడే ఛాన్స్ కూడా లేదట.
No comments
Post a Comment