ఆ శాఖలో చక్రం తిప్పుతున్న అధికారి
తప్పుడు ప్రమోషన్లు తోసుకొని పదోన్నతులు
ప్రభుత్వాలు మరీనా ఇతను చెప్పిందే వేదం.
దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏడువేల మంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా అధికారి తీరు.
తెలంగాణ లో ఏడాది పాలనపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో కొన్ని శాఖల్లో ఉన్నత పదవుల్లో చలామణీలో ఉంటున్నారు ఆఫీసర్లు.తప్పుడు ప్రమోషన్లతో పదోన్నతులు పొంది కింది స్థాయి ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారన్నా అపవాదు ఉంది. లేటేస్ట్ గా ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో కృష్ణా రావు అనే అధికారి పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత టీఆరెస్ ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయంలో విధులు నిర్వర్తించారు. అక్కడ నుండి కేవలం ఆరు నెలల వ్యవధిలో తన అధికార బలాన్ని వినియోగించి హైదరాబాద్ కు స్పెషల్ జీవో తో బదిలీ చేయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దిరగానే కొండగట్టు కు ట్రాన్స్ఫర్ పై వెళ్లారు. 2025 జనవరి లో మల్లి బదిలీ పై నగరంలో గణేష్ టెంపుల్ కు వచ్చారు.ఇలా అతను అనుకున్నదే తడువు నచ్చిన చోట పోస్టింగ్ తెచ్చుకుంటూ అర్హత ఉన్న మిగత వాళ్లకు నష్టం చేకూరుస్తున్నారు. ఇతని వల్ల 2006- 2007 పదోన్నతుల సీనియారిటీ అంశంలో వివాదం ఉంది. తద్వారా ఈవో గ్రేడ్ వన్ అధికారులు , మప్సీల్ సూపరిండెంటెండ్ స్టాఫ్ , ఏ ఈ ఓ లు చాల మంది నష్టపోతున్నారు. సీనియార్టీ లిస్టులో నలుగురు అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు తమ ప్రమోషన్లను కోల్పోతున్నారు. గతంలో జూపల్లి కృష్ణా రావు , పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ లీడర్ల వద్ద పిఎ గా చేసిన అనుభవంతో డిపార్ట్మెంట్ లో చక్రం తిప్పుతున్నారట. ఎలాంటి ప్రమోషన్ లు లేకుండా అడిషనల్ కమిషనర్ స్థాయికి రావడం వెనక తన సామజిక వర్గం , రాజకీయ పలుకుబడే కారణం అని మిగతా ఉద్యోగులు వాపోతున్నారు. అర్హత ఉండి కూడా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారంలో ఎవరు ఉన్న తనకు ఉన్న పలుకుబడి తో ఏడు వేల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపైన సంబంధిత శాఖ మంత్రి సెక్రెటరీకి చెప్పిన ఫలితం లేదు. మరోసారి మంత్రి ద్రుష్టి సారించాలని కోరుతున్నారు ఎంప్లాయిస్. గడిచిన సారి మంత్రి జూపల్లి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. ఓ కేసు విషయంలో హై కోర్ట్ మొట్టి కాయలు వేసింది. శాఖ కమిషనర్ , అడిషనల్ కమిషనర్ పని చేసి బదిలీ పై వెళ్లిన మహిళ అధికారి అండదండలతో భారీగా ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విజిలెన్స్ , ఎసిబి ద్రుష్టి పెట్టాలని మిగతా ఉద్యోగులు చెప్తున్నారు. 13 ఏళ్ళుగా కింది స్థాయి వాళ్ళకు తీవ్రంగా ఇబ్బంది కరంగా మారడంతో సీఎం ను కలిసి విన్నవించాలని భావిస్తున్నారు. తన ఉద్యోగం విషయంలో ఏదైనా సమస్య వస్తే సుప్రీం కోర్ట్ లో ఖరీదైన లాయర్లతో పిటిషన్ లు వేసే వారని తెలుస్తోంది. దీనిపైనా సుప్రీం కోర్ట్ సీరియస్ అయిందట.
No comments
Post a Comment