ఆర్అండ్ బి శాఖలో అవినీతి.
ఈఎన్సీ పై ఆరోపణలు.
ఇష్టా రాజ్యాంగ వ్యవహారం.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కొన్ని శాఖల్లో అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సగానికి పైగా అమలు కావడం లేదన్న ఆరోపణలు మురురుతున్న నేపత్యంలో ఆఫీసర్ల తీరు మరింత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దగ్గర పడుతున్న వేళ బాధితులకు న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.దానికి తోడు ఆర్ అండ్ బీ లాంటి కీలక శాఖల్లో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రోడ్డు & భవనాల శాఖలో సెక్రెటరీ తో పాటు ఈఎన్సీలపై అవినీతి , ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం కీలక శాఖల మీద ద్రుష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలనా అందివ్వాలని భావిస్తుంటే ఇందుకు అధికారులు బిన్నంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా సీఎం ద్రుష్టి పెడితే శాఖ బాగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
No comments
Post a Comment