ఒకే వ్యక్తికీ ఐదు పోస్టులు
ఆ శాఖలో తిరుపై గుసగుసలు
ముఖ్య మంత్రి సోదరుని సిఫార్స్ తో చక్రం తిప్పుతున్న వైనం
ఐదు కీలక పోస్టులన్నీ ఒకే వ్యక్తి చక్కబెట్టడం తో మిగతా సీనియర్లకు అన్యాయం
అసలు అర్హత కలిగిన వాళ్లకు నష్టం అంటున్న సంబంధిత డిపార్ట్మెంట్ల ఉద్యోగులు.
ప్రజా పాలనలో అండదండలు ఉన్నవారివే అధికారం అన్న విదంగా తయారైంది పరిస్థితి. అర్హత లేకున్నా పైనున్న వారి ఆశిస్యులు ఉంటె చాలు ఒకే వ్యక్తిక్తి ఐదేసి పోస్టులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. అందులో తెలంగాణ వారినీ కాదని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నారన్న అపవాదు ఎదురు అవుతోంది. తాజాగా జీహెచ్ ఎంసీ పబ్లిక్ హెల్త్ లో ఇంచార్జి ఈ ఎన్ సీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారి భాస్కర్ రెడ్డి అదనంగా మరో నాలుగు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాయలసీమ కు చెందిన ఈ అధికారికి ముఖ్య మంత్రి సోదరుని అండదండలతో ఏకంగా ఐదు పోస్టులు కలిగి ఉండటం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో కలవరం సృష్టిస్తుంది. తనకన్నా సీనియర్లకు అన్ని అర్హతలు ఉన్న కులం కార్డు వాడి ఇంచార్జి గా పదవి తెచ్చుకున్నారని వినికిడి. ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ఇంచార్జి తో పాటు సీఈ ( చీఫ్ ఇంజనీర్ ) ప్రాజెక్టు , సీఈ ( చీప్ ఇంజనీర్ ) మెయింటనెన్స్ , ఏస్ఈ ( సూపర్ఇండెంటెండ్ ఆఫ్ ఇంజనీర్ ) స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం, సీఈ ( చీప్ ఇంజనీర్ ) హోసింగ్ అండ్ అడ్మినిస్టేషన్ కు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని పదవులు ఒకే వ్యక్తికీ కేటాయించడం ఏంటని అందరూ నోరు వేళ్ళ వెడుతున్నారు. దీనిమీద సంబండింత శాఖల సీనియర్ ఐఏఎస్ లు స్పందించాలన్న డిమాండ్ వస్తుంది. టప్పాల్ కూడా సరిగా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ద్రుష్టి సారించాలని కొరుతున్నారు బాధితులు.ఇలంబర్తి ఎంతో కష్టపడుతున్న ఇలాంటి అధికారుల తీరు వల్ల డిపార్ట్మెంట్ కు చెడ్డా పేరు వస్తుందని అంటున్నారు.
No comments
Post a Comment