Responsive Ad Slot

Latest

latest

హెచ్ ఎండీ ఎ లో తప్పని తిప్పలు

Friday, February 7, 2025

/ by Telangana Public Pulse

హెచ్ఎండీఎలో తప్పని తిప్పలు.

పైనుండి  ఆదేశాలు వస్తే తప్ప ముందుకు కదలని ఫైళ్లు*.

బాధితులకు తప్పని ఇబ్బందులు.

సీఎంఓ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితి లేక సామాన్యుల ఇక్కట్లు.*


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పై సామాన్యులు గుర్రుగా ఉన్నారట.నెలల తరబడి తమ ఫైళ్లు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని స్వర్ణ భారతీ జయంతి కాంప్లెక్స్ లో చర్చించుకున్నారని వినికిడి. ఎకరం , రెండెకరాల నుండి మొదలు పది ఎకరాల వరకు అనుమతులు రాకపోవడంతో సదరు బెనిఫిర్స్ ఆందోళనలో ఉన్నారు.లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షనలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.ఫైళ్లు ఎందుకు ఆగుతున్నాయని అడగటంతో సదరు అధికారులు ఇచ్చే సమాధానంతో ఖంగు తింటున్నామని చెప్తున్నారు. పైనుండి ఆదేశాలు వస్తే ఫైళ్లు క్లియర్ చేసేది లేదని చెప్పడంతో ఎవరిని కాలవలో తెలియక అయోమయంలో ఉంటున్నారని అంటున్నారు.దీనివల్ల హెచ్ఎండీ ఎ కు చెడ్డ పేరు వస్తుందని ఫైర్ అవుతున్నారు.గతంలో అరవింద్ కుమార్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది.ఇప్పుడు అదే తంతు నడవడంతో  తమ గోడు ముఖ్య మంత్రికి అయిన తెలియజేస్తే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట.ప్రస్తుతం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా అరవింద్ కుమార్ ఎదురుకున్న పరిస్థితే ఎదురుకుంటున్నారని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అటు మునిసిపాల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇదే గందరగోళం నెలకొంది.పైనుండి అనుమతి వస్తే తప్ప లే అవుట్లకు జీవో మోక్షం లభించదని ఆఫీసర్ బాహాటంగానే చెప్తున్నారట.200 ఫైళ్లు ఎంఎయుడి లో పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.ఇక్కడ కూడా ఎకరం , రెండు ఎకరాలు , ముడు వేల గజాల వరకు కూడా పై నుండి ఆదేశాలు వస్తే తప్ప కదలని పరిస్థితి నెలకొంది.మునిసిపల్ శాఖ సీఎం వద్ద ఉండటంతో ఎవరు ప్రశ్నించడానికి దైర్యం చేయడం లేదట.ఇలాగె కొనసాగితే ప్రజల నుండి వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు మేధావులు. నిరంతరం ప్రజలతో మమేకం అయి ఉండే డిపార్టుమెంట్ల పరిస్థితి ఇలాగె ఉంటె గత బిఅరెస్ కు ఎదురైనా ఇబ్బందే కాంగ్రెస్ ఎదురు కొవాల్సి వస్తుందని అంటున్నారు.

No comments

Post a Comment

Don't Miss
© all rights reserved
made with by kollasinfotech