తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి చిన్న ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వరుస దాడుల్లో నలభైకి పైగా ఫాల్స్ కేసులు తేలినట్లు సమాచారం శాఖ తీరుపై సీఎం ద్రుష్టి పెట్టాలంటున్న ప్రభుత్వ ఉద్యోగులు. - ప్రభుత్వ పరిధిలో జితా భత్యాలు తీసుకొనే వారందరికి అవినీతి నిరోధక శాఖ అంటే భయం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఏసీబీ అధికారులు కాస్త స్పీడ్ పెంచారనే చెప్పాలి. పంచాయితీరాజ్ , ఇరిగేషన్ , ఆర్ అండ్ బీ , విద్యుత్ శాఖ లాంటి వాటిపై ద్రుష్టి పెడుతున్న ఏసీబీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ , పలువురు ఉన్నతాధికారులు ,( ఐఏఎస్ , ఐపీఎస్ ) లతో పాటు పలువురు రాజకీయ నాయకులపై కూడా ద్రుష్టి సారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చితక ఉద్యోగులనే టార్గెట్ చేయడం వల్ల ఎంప్లాయిస్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏసీబీ లో కొంతమంది అధికారుల అత్యుత్సహం సర్కార్ ను ఇరకాటంలో పెట్టెలా చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగిన చర్యలు తీసుకుంటమని చెప్తున్నా అనిశా వందల ఫైళ్లు పెండింగ్ లో పెట్టె కొంతమంది ఐఏఎస్ ల మీద...